రెండోసారి అండర్‌–19 టీ20 ప్రపంచకప్‌ కైవసం!! అమ్మాయిలు అదరగొట్టేశారు!!

  • త్రిష అద్భుత ప్రదర్శన – 3 వికెట్లు, 44 నాటౌట్‌
  • ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం

భారత అండర్‌–19 అమ్మాయిల జట్టు మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన టైటిల్‌ పోరులో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయానికి తెలంగాణ ఆల్‌రౌండర్ గోంగడి త్రిష ప్రధాన కారణంగా నిలిచింది. బౌలింగ్‌లో 3/15, బ్యాటింగ్‌లో 44 నాటౌట్ చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత బౌలర్లు సఫారీ జట్టును 82 పరుగులకే ఆలౌట్‌ చేశారు. పారుణిక సిసోడియా (2/6), ఆయుషి శుక్లా (2/9), వైష్ణవి (2/23) తమ అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు. అనంతరం త్రిష దూకుడైన బ్యాటింగ్‌తో 11.2 ఓవర్లలోనే భారత్ విజయాన్ని ఖరారు చేసింది.

వరుసగా రెండోసారి ఛాంపియన్‌

  • 2023లో షఫాలీ వర్మ నేతృత్వంలో భారత జట్టు మొదటి అండర్‌–19 టీ20 ప్రపంచకప్ గెలిచింది.
  • 2025లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మరోసారి అజేయంగా విజయం సాధించింది.
  • టోర్నమెంట్ మొత్తం ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *