భారత్ బౌలింగ్ దెబ్బకు బంగ్లాదేశ్ కష్టాల్లో!! అక్షర్ హ్యాట్రిక్ మిస్ చేసిన రోహిత్

  • షమీ (5/53) ఐదు వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన చేశాడు
  • హృదోయ్ (100) సెంచరీతో పోరాడినా, బంగ్లా 228 పరుగులకే ఆలౌట్

దుబాయ్ వేదికగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలింగ్ దెబ్బకు 35/5 స్కోర్‌తో కష్టాల్లో పడిన బంగ్లాదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ హృదోయ్ (100) సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి జకేర్ అలీ (68) తోడుగా నిలిచాడు. అయితే, షమీ ఐదు వికెట్ల దెబ్బతో బంగ్లా గాడి తప్పింది.

రోహిత్ క్యాచ్ మిస్, బంగ్లాకు ఊరట!!

భారత బౌలింగ్‌లో హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి మెరిశారు. బుమ్రా లేకపోవడం భారత బౌలింగ్‌పై ప్రభావం చూపుతుందా? అనే సందేహానికి షమీ తన ప్రదర్శనతో సమాధానం చెప్పాడు. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి, బంగ్లాకు బ్రేక్ ఇచ్చాడు. రోహిత్ జకేర్ అలీ క్యాచ్ మిస్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ నిలదొక్కుకుంది. షమీ తన 200వ వన్డే వికెట్ తీసి అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *