2024.. దేశ రాజకీయాల్ని ఎలా మార్చింది!!? ఇవిగోండి కొన్ని ముఖ్యమైన సంఘటనలు..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఈ క్రమంలో గతేడాది చోటు చేసుకున్న ముఖ్య ఘట్టాలు.. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడం వంటి కీలక సంఘటనలు భారత రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు జరిగాయి, అయితే బీజేపీ 240 సీట్లతో అధికారంలోకి వచ్చింది.

అయోధ్యలో బీజేపీ ఓటమి: 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లకు గాను కేవలం 37 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అత్యంత హాట్ సీటుగా నిలిచిన అయోధ్యలో బీజేపీ ఓటమి చవిచూసింది. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సి వచ్చి, తన పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సోరెన్ కూడా అవినీతిలో జైలుకు వెళ్లి, తిరిగి సీఎం పదవిని చేపట్టారు. నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు తెరపడుతూ ఒడిశాలో ఓటమి చవిచూశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *