▪️ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు
▪️ ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్న వేడుకలు
▪️ “యోగా వల్ల మానవతా విలువలు పెరుగుతాయి” అని మోదీ సందేశం
▪️ యోగాంధ్ర విజయానికి లోకేశ్ పాత్రను ప్రధాని ప్రశంసించారు
▪️ ‘‘యోగా కేవలం వ్యాయామం కాదు.. జీవనశైలి’’ అని మోదీ స్పష్టం
అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జ్ఞాపికను స్వీకరించిన మోదీ, అనంతరం వేదికపై ప్రసంగిస్తూ… యోగా ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందన్నారు. ‘‘యోగా శారీరక సాధన మాత్రమే కాదు, మనిషిలో మానవత్వాన్ని పెంచే సాధన’’ అని ఆయన వివరించారు. ప్రపంచంలో 175 దేశాలు ఈ యోగా దినోత్సవానికి మద్దతుగా నిలవడం సౌభాగ్యం అని పేర్కొన్నారు. ‘‘గ్రామాల్లో యువకులు యోగాను స్వీకరిస్తుండటం మార్పు సంకేతం. మనం అన్న భావనను పెంచే సాధన ఇది’’ అన్నారు. ఇదే సందర్భంగా ప్రధాని… ఈ వేడుకల నిర్వహణలో నెలన్నర రోజుల్లో మంచి విజయాన్ని అందించిన మంత్రి లోకేశ్ చొరవను ప్రత్యేకంగా ప్రశంసించారు.





