ఇరాన్‌ పోర్టు పేలుడు: 25 మంది మృతి, 750 మందికి గాయాలు!

ఇరాన్‌లోని షాహిద్ రజాయి పోర్టులో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. 750 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, పేలుడు ధాటికి భవనాల అద్దాలు ధ్వంసమై, ఒక భవనం కూలిపోయింది. దట్టమైన నల్లటి పొగ వ్యాపించడంతో సమీపంలోని పాఠశాలలు, కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

ఇది దాడి కాదు. కంటైనర్లలోని రసాయనాలు పేలడం వల్ల ప్రమాదం జరిగింది!” – ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.

సోడియం పెర్‌క్లోరేట్‌తో కూడిన రాకెట్ ఇంధనం అసురక్షిత నిల్వ వల్ల పేలుడు సంభవించినట్లు అంబ్రీ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఇదిలా ఉంటే, ఇరాన్ అధికారులు దీనిని దాడిగా పరిగణించడం లేదు. అంతేకాదు, పోర్టు అధికారులకు గతంలో రసాయనాల నిల్వపై హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడైంది. దీంతో, అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అగ్నిమాపక బృందాలు రాత్రి వరకు మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నాయి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *