కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వెండితో తయారైన బెడ్, డైనింగ్ టేబుల్, చైర్స్… రాజభవనం తరహా ఇంటి డిజైన్, రోజ్ వుడ్‌తో ప్రత్యేకమైన ఇంటీరియర్!!
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంటి విలాసవంతమైన లోపలి చిత్రాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా ఇంట్లో వెండి సామగ్రి అంటే పూజా సామానులు, గ్లాసులు ఉంటాయి. కానీ, ఆయన ఇంట్లో మాత్రం బెడ్, డైనింగ్ టేబుల్, చైర్లు కూడా వెండితోనే తయారు చేయించుకున్నారు. అంతేకాదు, రోజ్ వుడ్‌తో సీలింగ్, రాజభవనం తరహా ఇంటీరియర్ ఉండటంతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది. ఈ లగ్జరీ హౌస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.





