- జనసేన ప్రజల కోసం పనిచేసే పార్టీగా ఎదిగింది – నాదెండ్ల మనోహర్
- రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యం
జనసేన పార్టీ ప్రజలకు మేలు చేసేందుకు కట్టుబడి ఉందని పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తెలిపారు. అనేక అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, పవన్ కల్యాణ్ తనతోపాటు ఉన్న ప్రతి కార్యకర్తను గౌరవించారని చెప్పారు. 2017-18లో పార్టీలో చేరినప్పుడు పదవుల గురించి కాకుండా, యువతను నాయకులుగా తీర్చిదిద్దడమే పవన్ లక్ష్యమని గుర్తుచేశారు. ప్రస్తుతం 12.32 లక్షల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారని, ఇది జనసేన కృషికి నిదర్శనమని చెప్పారు.
ప్రతిపక్షం నుంచి పాలన వైపు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతా జనసేన తన వైఖరిని మార్చుకోలేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. రోడ్ల సమస్యలపై “గుడ్‌మార్నింగ్ సీఎం” ఉద్యమం చేపట్టిన జనసేన, అధికారంలోకి వచ్చిన వెంటనే 3,300 కి.మీ. రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిందన్నారు. రైతుల కోసం పవన్ కల్యాణ్ చేపట్టిన దీక్షల ఫలితంగా, ప్రభుత్వం 5.42 లక్షల మంది రైతుల నుంచి 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లోనే రూ.7,800 కోట్లు వారి ఖాతాల్లో జమచేసిందని చెప్పారు.





