- రూ.299 లేదా ఎక్కువ రీఛార్జ్‌పై ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్
- మార్చి 17 నుంచి 31 వరకు ఆఫర్ అందుబాటులో
క్రికెట్ అభిమానులకు జియో స్పెషల్ గిఫ్ట్ ప్రకటించింది. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను ఫోన్, టీవీ, 4K స్ట్రీమింగ్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు.
50 రోజుల పాటు జియో ఫైబర్ ఉచిత సేవలు.. అపరిమిత వైఫై, 800+ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్స్.. రూ.100 ప్లాన్‌పై 5జీబీ డేటాతో 90 రోజుల హాట్‌స్టార్ యాక్సెస్.. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభమవుతుండగా, హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అదే రోజు యాక్టివేట్ అవుతుందని జియో ప్రకటించింది.





