‘ కందికుంట‌ ‘ కు క‌దిరి ప్ర‌భంజ‌నం.. స్నేహ‌శీలికి 25 ఏళ్లుగా ప్ర‌జ‌ల నీరాజనం..!

  • 25 ఏళ్లుగా ఎంద‌రు నాయ‌కులు మారినా క‌దిరిని కాపాడుతున్న ఒకే నేత‌
  • గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా క‌దిరికి జీవితం అంకితం
  • వేల మందికి సేవ‌లు… నారాయ‌ణ‌మ్మ ట్ర‌స్ట్ ద్వారా పంచాయ‌తీకో బోరు
  • సోలార్ ప్లాంట్‌, హంద్రి నీవా జలాలు రావ‌డంలో కీ రోల్‌
  • భ‌ర్త బాట‌లోనే భార్య య‌శోద‌మ్మ జీవితం ప్ర‌జ‌ల‌కే అంకితం

జ‌నం – జ‌యం.. ఈ రెండు సాధించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. జ‌నాల మ‌న‌సులు దోచుకునేందుకు.. జ‌నం అభిమ‌తాన్ని సొంతం చేసుకునేందుకు కూడా.. నాయ‌కుల‌కు ఎంతో ఓర్పు, నేర్పు.. అంత‌కుమించిన స్నేహ శీల‌త చాలా చాలా ముఖ్యం. ఏరోజుకు ఆరోజు.. ఏటికి ఆయేడు మారుతున్న రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంటున్న నాయ‌కులు త‌క్కువ మంది ఉంటున్నారు. మ‌రీ ముఖ్యంగా గెలుపు-ఓట‌ముల‌తో సంబంధం లేకుండా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న వారి సంఖ్య కూడా.. త‌క్కువ‌గానే ఉంటోంది.

ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు కందికుంట వెంక‌ట ప్ర‌సాద్‌. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ని కీల‌క‌మైన క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు – ఓట‌ముల‌తో సంబంధం లేకుండా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరు వ అయ్యారు. గెలిచినా.. ఓడినా.. త‌న కుటుంబాన్ని ప్ర‌జ‌ల‌కే ఆయ‌న అంకితం చేశారు. వాస్త‌వానికి నేటి రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. గెలిస్తే.. ఒక విధంగా ఉండే నాయ‌కులు అదే ఓడితే.. అధికార పార్టీవైపు గెంతులు వేస్తున్న విష‌యం తెలిసిందే. కానీ, 25 ఏళ్లుగా కందికుంట రాజ‌కీయం.. దీనికి భిన్నంగా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై.. పార్టీని న‌మ్ముకున్న తీరు న‌భూతో న‌భ‌విష్య‌త్‌ అనే చెప్పాలి.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *