- బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లో ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో కేఫ్, రెస్టారెంట్ ప్రారంభించారు.
- తన చిన్ననాటి కలను నిజం చేసుకున్న కంగనా, హిమాచలీ సంప్రదాయ వంటకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించింది. ఫిబ్రవరి 14న గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందని ఆమె వెల్లడించింది. స్థానికంగా ప్రసిద్ధి చెందిన వంటకాలను, ఆధునిక టచ్‌తో వినిపించే ప్రత్యేకమైన ఫుడ్‌ను అందించాలని తాను అనుకున్నట్లు తెలిపారు. ఈ రెస్టారెంట్ ద్వారా తన పుట్టిన ఊరుకు సేవ చేయాలని కంగనా పేర్కొన్నారు. “పర్వతాలు నా ఎముకలు, నదులు నా సిరలు” అంటూ తన అనుబంధాన్ని వ్యక్తపరిచారు. సోషల్ మీడియాలో రెస్టారెంట్ వీడియోను షేర్ చేయగా, అందులోని అందమైన ఇంటీరియర్ డిజైన్, బహిరంగ సీటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కంగనాకు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు, నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు.





