- మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్ విడుదల
- శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్, చివరిలో ప్రభాస్ రుద్ర అవతారంలో హైలైట్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదలైంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్, కాజల్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
భారీ బడ్జెట్ – న్యూజిలాండ్‌లో షూటింగ్
ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. మూడో శతాబ్దం నాటి కథ కావడంతో, న్యూజిలాండ్‌లో ప్రత్యేకంగా చిత్రీకరణ చేశామని మేకర్స్ తెలిపారు. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ కనిపిస్తుండగా, టీజర్ చివర్లో రుద్రంగా ప్రభాస్ కనిపించడం హైలైట్‌గా మారింది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.





