భర్తను కలవడానికి లండన్ వెళ్తూ.. ఇదే ఖుష్బు చివరి వీడియో!!

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం (AI171) గురువారం కూలిన ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో రాజస్థాన్‌కు చెందిన నవవధువు ఖుష్బు రాజ్‌పురోహిత్ (25) విషాద కథ సోషల్ మీడియాలో కన్నీరు తెప్పిస్తోంది. జనవరి 18, 2025న బలోత్రాలో విపుల్ సింగ్ రాజ్‌పురోహిత్‌తో వివాహమైన ఖుష్బు, లండన్‌లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న తన భర్తను మొదటిసారి కలవడానికి ఈ విమానంలో ప్రయాణించింది. వివాహం తర్వాత విపుల్ రెండు నెలలకే లండన్ వెళ్లగా, ఖుష్బు తర్వాత ప్రయాణమైంది.

భర్తతో కొత్త జీవితం కోసం వెళ్తున్న ఖుష్బు, AI171 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది!

ఖుష్బు విమానం ఎక్కే ముందు కుటుంబంతో సన్నిహితంగా మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె తండ్రి మదన్ సింగ్ రాజ్‌పురోహిత్ ఆమెను విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పారు. టేకాఫ్ తర్వాత కొన్ని క్షణాల్లో విమానం వైద్య కళాశాల సముదాయంపై కూలిపోయింది. ఈ ఘటనలో ఒక్కరు మినహా అందరూ మృతిచెందారు. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లను విశ్లేషిస్తున్నారు. ఖుష్బు కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *