సోషల్ మీడియాలో తన ఫొటోలతో అభిమానులను అలరించే నటి ఖుష్బూ తాజాగా న్యూలుక్ ఫొటోలు షేర్ చేశారు. అయితే, ఈ ఫొటోల్లో ఆమె సన్నగా కనిపించడంతో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనిపై ఖుష్బూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, కానీ ట్రోలింగ్ విషయంలో ఆమె గట్టిగా స్పందించడం చర్చనీయాంశమైంది.
“మీరు ఎలాంటి మనుషులు? మీ ముఖాలను సోషల్ మీడియాలో ఎందుకు చూపించరు, ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు,” అని ఖుష్బూ ట్రోలర్లపై ఫైర్ అయ్యారు.
“బ్యాక్ టూ ద ఫ్యూచర్” అనే క్యాప్షన్‌తో ఖుష్బూ షేర్ చేసిన ఫొటోలు కొందరి నుంచి ప్రశంసలు అందుకున్నాయి. అయితే, కొంతమంది నెటిజన్లు “సన్నగా మారడానికి ఇంజెక్షన్స్ తీసుకున్నారు, దాని గురించి చెప్పండి” అంటూ విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్లకు ఖుష్బూ రీట్వీట్‌తో సమాధానమిచ్చారు, ట్రోలర్ల వ్యక్తిత్వంపైనే ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం ఖుష్బూ సినిమాలు, సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల తమిళ చిత్రం ‘నేసిప్పాయ’లో నటించి మెప్పించారు.





