ప్రసిద్ధ కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తన 28 సంవత్సరాల సినీ ప్రయాణం గురించి చర్చిస్తూ, రిటైర్మెంట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నేను ఎక్కువ సినిమాలు తీయకపోవచ్చు, కానీ ఇండస్ట్రీని ఎప్పటికీ వదలడం లేదు” అని ఆయన స్పష్టంగా చెప్పారు. సుదీప్ మాట్లాడుతూ, “ప్రతి హీరో ఏదో ఒక సమయంలో బోర్ కొట్టేస్తాడు. అందరికీ ఒక టైమ్ ఉంటుంది” అని పేర్కొన్నారు. అయితే, ఆయన ఇంకా అలసిపోలేదని, కానీ భవిష్యత్తులో నటన నుంచి వైదొలిగే అవకాశం ఉందని తెలిపారు. “నేను ఎప్పుడూ సెట్‌లో ఎవరినీ వెయిట్ చేయించలేదు” అని ఆయన అన్నారు. సుదీప్, సోదరుడు లేదా మామయ్య వంటి సపోర్టింగ్ రోల్స్ చేయడానికి ఆసక్తి లేదని తెలిపారు. ఇటీవల రిజెక్ట్ చేసిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, “అవి కథలు నచ్చకపోవడం వల్ల కాదు, కానీ ఈ సమయంలో వాటిని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం కాదని అంగీకరించలేదు” అని చెప్పారు.





