హైకోర్టు రిజిస్ట్రార్ జిల్లా కలెక్టర్‌కు లేఖ, మౌలిక సదుపాయాలపై నివేదిక సమర్పణకు డెడ్‌లైన్. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల పరిశీలన, ప్రత్యేక కమిటీ ఏర్పాటుతో వేగంగా జరుగుతున్న పనులు
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు రిజిస్ట్రార్ శ్రీనివాస శివరాం ఈ నెల 29న జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు లేఖ రాస్తూ, 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, న్యాయవాదులకు వసతి, కోర్టు సిబ్బంది నివాసాలను పొందుపరిచిన పూర్తి వివరాలను ఒక్కరోజులోనే సమర్పించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖలను నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రయత్నాలు ముమ్మరం
కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీని సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ఏర్పాటు చేశారు. రూ.25 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన విద్యుత్తు నియంత్రణ మండలి (APERC) భవనం, ఖాళీగా ఉన్న కళాశాలలు, ప్రైవేట్ భవనాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.






