- మోహన్‌లాల్ చిన్నప్పటి పాత్రకు ఏఐ వాడినట్లు వస్తున్న వార్తలను ఖండించిన దర్శకుడు పృథ్వీరాజ్.
- సినిమా వివాదాల కారణంగా 24 మార్పులు సూచించిన సెన్సార్ బోర్డు, కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న మూవీ.
యాక్షన్ థ్రిల్లర్ ‘ఎల్2: ఎంపురాన్’ చిత్రంపై ఎడతెరిపి లేని చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా, మోహన్‌లాల్ చిన్నప్పటి పాత్ర కోసం ఏఐ ఉపయోగించారని వచ్చిన ఆరోపణలపై తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ స్పందించారు. ఈ పాత్రలో మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ నటించారని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, వివాదాల నేపథ్యంలో చిత్రబృందం కొన్ని సీన్లు ఎడిట్ చేసి మళ్లీ సెన్సార్‌కు పంపింది. సెన్సార్ బోర్డు 24 మార్పులు సూచిస్తూ, కొన్ని డైలాగ్‌లను మ్యూట్ చేయాలని, కొన్ని విజువల్స్ తొలగించాలని సూచించింది. అయితే, వివాదాలే ఈ సినిమాకు ప్లస్ అయి, ఇప్పటివరకు రూ.200 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే రూ.250 కోట్ల మార్కును చేరుకుంటుందని అంచనా. అంతేకాకుండా, ఈ ఏడాది ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.





