కారులో ప్రేమ జంట ఆత్మహత్య: కుటుంబ ఒత్తిడి, బ్లాక్ మెయిల్ కారణంగా విషాద ఘటన!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఘట్‌కేసర్‌లో విషాద ఘటన జరిగింది. వేర్వేరు కులాలకు చెందిన ప్రేమికులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్ల శ్రీరాములు మరియు 17 ఏళ్ల బాలిక, తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించరని ఆందోళన చెందారు. పోలీసుల కథనం ప్రకారం, శ్రీరాములు మరియు బాలిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే, బాలిక కుటుంబానికి వీరి సంబంధం తెలిసిన తర్వాత, ఆమెపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో, బాలిక సమీప బంధువు చింటూ, శ్రీరాములను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. “డబ్బు ఇవ్వకపోతే తల్లిదండ్రులకు చెబుతానని” బెదిరించాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేకపోయిన శ్రీరాములు.. అప్పటికే 1.35 లక్షలు ఇచ్చాడు. ఇంకా కావాలని అడగడం.. పెద్దలు పెళ్లికి అంగీకరించరేమో అని ఒత్తిడికి గురయ్యారు.

విషాదకరమైన నిర్ణయం

సోమవారం, శ్రీరాములు ఒక కారు అద్దెకు తీసుకుని, ఇద్దరూ కలిసి ఘట్‌కేసర్‌లోని ఓ ప్రదేశంలో కారులో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో బాలిక కారులో చిక్కుకుపోయి మృతదేహం పూర్తిగా కాలిపోయింది. శ్రీరాములు మాత్రం బయటకు వచ్చి హాహాకారాలు చేస్తూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు చింటూ నివాసంపై దాడికి వెళ్లారు. కానీ అతను లేకపోవడంతో, అతని తండ్రిని కొట్టారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *