2025 జనవరి 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ (19 కేజీలు) ధరలను తగ్గించినట్లు ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు మెట్రో నగరాల్లో ధరలు రూ. 14.5 నుంచి రూ. 16 వరకు తగ్గించాయి. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 1804కి చేరింది. ఇదే ముంబైలో రూ. 1756, చెన్నైలో రూ. 1966, కోల్‌కతాలో రూ. 1911గా ఉంది. హైదరాబాద్‌లో రూ. 16 తగ్గించడంతో ఈ ధర ఇప్పుడు రూ. 2028గా ఉంది. గత 5 నెలలుగా వరుస పెరుగుదల తర్వాత ఇప్పుడు ధర తగ్గడం గమనార్హం.
గృహ వినియోగ సిలిండర్ ధరలు స్థిరంగా
ఇతరవైపు, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధరలు మాత్రం మార్చి నుంచి ఏ మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా చివరిసారి రూ. 100 తగ్గించగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ ధర రూ. 855గా ఉంది. ఢిల్లీలో రూ. 803, ముంబైలో రూ. 802.50, చెన్నైలో రూ. 818.50గా ఉన్నాయి. ఉజ్వల పథకం కింద అర్హులకు రూ. 300 రాయితీ కొనసాగుతోంది.






