వర్షం కురుస్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడటం చాలా ప్రమాదకరం. అలాంటి ఒక భయంకరమైన ల్యాండ్‌స్లైడ్ నుంచి ఒక కారు సెకన్ల తేడాతో తప్పించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ లక్కీగా బయటపడిన ఈ షాకింగ్ దృశ్యం చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో భారీ వర్షం కురుస్తోంది. ఒక హైవే పక్కన ఉన్న కొండ నుంచి ఒక్కసారిగా మట్టి, రాళ్లు జారిపడటం మొదలవుతుంది. అదే సమయంలో ఒక నల్లటి ఎస్‌యూవీ కారు ముందుకు వెళ్తోంది. కారు ముందుకు దూసుకువెళ్ళిన వెంటనే, దాని వెనుక భాగంలో ల్యాండ్‌స్లైడ్ సంభవిస్తుంది. క్షణాల్లోనే మట్టి, రాళ్లు రోడ్డును ముంచేస్తాయి. ఈ విపత్తు నుంచి కారు డ్రైవర్ అద్భుతంగా తప్పించుకున్నాడు. వెనుక ఉన్న ఇతర వాహనాలు అక్కడే ఆగిపోయాయి.
సోషల్ మీడియాలో వైరల్
“మనోడికి సుడి ఎంతంటే చిత్రగుప్తుడు కంటి రెప్ప కంటే ఫాస్ట్..😂” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు కేవలం కొన్ని గంటల్లోనే 77 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన వీడియో కావచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఎక్కడిదో స్పష్టత లేనప్పటికీ, వర్షాకాలంలో ఇలాంటి ల్యాండ్‌స్లైడ్ ప్రమాదాలు సాధారణం. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, వర్షాకాలంలో కొండ ప్రాంతాల రోడ్లపై మరింత జాగ్రత్త వహించాలని ఈ వీడియో ఒక హెచ్చరికగా నిలుస్తోంది.





