అండర్-19 మహిళల ప్రపంచకప్‌: గొంగడి త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!!

అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో మొట్టమొదటి సెంచరీ సాధించిన గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. త్రిష భారత జట్టుకు కీలకపాత్ర పోషించడం గర్వకారణమని ఆయన తెలిపారు.

తెలంగాణకు చెందిన యువ క్రికెటర్ గొంగడి త్రిష, అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో మొట్టమొదటి సెంచరీ సాధించి, ప్రపంచ వేదికపై మన దేశ సత్తా చాటింది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు. “భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం మనందరికీ గర్వకారణం” అని ఆయన అన్నారు.భవిష్యత్‌లో మరింతగా రాణించి తెలంగాణ క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆశిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. “త్రిష లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది” అని తెలిపారు. క్రీడల ప్రోత్సాహానికి ప్రజాప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించాలని పిలుపునిచ్చారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *