ఓ తల్లి తన చిన్నారిని చీరతో కట్టి రోడ్డుపై నిలబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బాలుడి ముద్దుముద్దుగా ఉన్న తీరు, చిరునవ్వు చూసి నెటిజన్లు “సో క్యూట్” అంటూ ఆనందపడుతున్నారు. “మట్టిలో మాణిక్యం” అని ఈ వీడియోకు పెట్టిన క్యాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ తల్లి తన బుడ్డోడిని పసుపు రంగు స్లింగ్‌తో ఎత్తుకుంది. కర్లీ హెయిర్, పర్పుల్ చుక్కల షర్ట్‌తో బాబు క్యూట్ గా కనిపిస్తున్నాడు. తల్లి స్లింగ్‌ను సరిచేస్తుండగా, బాలుడు నవ్వుతూ, చేతులు ఆడిస్తూ ముఖాన్ని తాకుతూ కనిపించాడు. ఈ వీడియోను X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. “ఎంత ముద్దొస్తున్నాడో బుడ్డోడు 🤗 మట్టిలో మాణిక్యం అంటే ఇదేనేమో 😍” అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ వీడియోకు 34 వేలకు పైగా వ్యూస్, 2.5 వేల లైకులు, 300 రీపోస్ట్‌లు వచ్చాయి. నెటిజన్లు ‘‘బంగారం లాంటి బేబీ’’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో మాతృప్రేమకు, బాల్యపు అందానికి నిదర్శనంగా నిలుస్తూ, అందరి హృదయాలను హత్తుకుంటోంది.





