మేఘాలయ హనీమూన్ హత్య క్లూస్: ట్రెక్కింగ్ వీడియోలో రాజా రఘువంశీ హత్యాకాండ నిందితులు!!

  • మే 23న రికార్డ్ అయిన వీడియోలు కీలక ఆధారాలుగా మారాయి.
  • ఒక నిందితుడు కెమెరా చూసి ముఖం దాచుకున్నట్లు కనిపిస్తోంది.

మేఘాలయలో హనీమూన్ సందర్భంగా జరిగిన రాజా రఘువంశీ హత్య కేసులో కీలక మలుపు వచ్చింది. మే 23న సోహ్రాలోని ప్రసిద్ధ ‘డబుల్ డెక్కర్ ట్రెక్’ వద్ద ఓ పర్యాటకుడు తీసిన వీడియోలు ఇప్పుడు ఈ కేసులో ప్రధాన ఆధారాలుగా మారాయి. ఈ వీడియోల్లో రాజా, అతని భార్య సోనం, ఇంకా ముగ్గురు నిందితులు ట్రెక్‌లో నడుస్తూ కనిపించారు. రాజా చిన్న బ్యాగ్‌తో ముందుంటే, సోనం కొద్దిగా వెనుక నుంచి నడుస్తూ కెమెరా వైపు కోపంగా చూస్తూ కనిపించింది. ఈ దృశ్యం ఆమె చిత్రీకరణ జరుగుతోందని తెలుసుకున్నట్లుగా అనిపిస్తోంది.

వెనుకనుంచి నడుస్తున్న నిందితుడి అనుమానాస్పద ప్రవర్తన

వీడియోల్లో విశాల్, ఆకాశ్, ఆనంద్‌ అనే ముగ్గురు నిందితులు స్పష్టంగా కనిపించారు. ఒకరు కెమెరా కనిపించగానే తన ముఖాన్ని దాచుకోవడం, విచారణలో కీలకాంశంగా మారింది. పోలీసులు ఈ ఫుటేజీ ఆధారంగా మే 23న అందరూ అదే ప్రదేశంలో ఉన్నారని స్పష్టంచేశారు. అంతేకాదు, రాజా హత్యకు గురైన రోజే ఈ ట్రెక్‌లో చివరిసారిగా కనిపించడం, అతని మృతదేహం జూన్ 2న లభించడం నేపథ్యంలో ఈ వీడియోలు దర్యాప్తుకు కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *