తెలంగాణ అంటే Sports! థ్యాంక్స్ టూ మెస్సీ: సీఎం Revanth Reddy

CM Revanth Reddy welcoming Lionel Messi to Hyderabad with Rahul Gandhi
  • ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ హైదరాబాద్‌ సందర్శన
  • సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు
  • ఈవెంట్‌కు రాహుల్ గాంధీ హాజరు
  • తెలంగాణ అంటే Sports, Excellence, Hospitality అని సీఎం కితాబు

ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరొందిన GOAT లియోనెల్ మెస్సీ సహా, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ హైదరాబాద్‌ను సందర్శించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. (Messi Hyderabad Revanth Reddy) మెస్సీ, ఇతర క్రీడాకారులు తమ ఆహ్వానాన్ని మన్నించి, హైదరాబాద్‌కు వచ్చి, యువతను, క్రీడాభిమానులను ఉర్రూతలూగించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ పాల్గొని, ఈ సాయంత్రాన్ని జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చారని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ అంటే Hospitality

ప్రపంచ దిగ్గజాలను ఆహ్వానించి, ఈవెంట్‌ను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ అంటే Sports, తెలంగాణ అంటే Excellence, తెలంగాణ అంటే Hospitality అని ప్రపంచానికి చాటిచెప్పామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ GOAT India Tour ను విజయవంతం చేయడంలో సహకరించిన అధికారులకు, భద్రతా సిబ్బందికి, నిర్వాహకులకు, ఇతర సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించిన క్రీడాభిమానులకు, ప్రజలకు ప్రభుత్వం తరపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ అంతర్జాతీయ Sports ఈవెంట్‌తో తెలంగాణ బ్రాండింగ్ మెరుగుపడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *