“జగన్ ఇంకా నిద్రలోనే ఉన్నారు!! పవన్ విజయంలోనే భవిష్యత్” – నాగబాబు

“జగన్‌ ఇంకా నిద్రలోనే.. పవన్‌ కల్యాణ్‌ విజయమే భవిష్యత్‌”.. పవన్ అఖండ విజయం సాధించడానికి రెండు కారణాలు – జనసేనాని, ప్రజలే..

జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిద్రలోకి వెళ్లారని, ఇంకా లేవలేదని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వ్యాఖ్యానించారు. “ఎన్నికల ముందు కళ్లు మూసి తెరిస్తే అయిదేళ్లు అయిపోతాయి. తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తానంటూ హాస్యనటుడిలా కామెడీ చేస్తారు” అని ఎద్దేవా చేశారు. జనసేనకు 12 ఏళ్లు పూర్తయిన వేళ, పార్టీ మరింత బలంగా ఎదిగిందని చెప్పారు. “పిఠాపురం ఓటర్లు, జనసేన కార్యకర్తలు లేకుంటే పవన్ విజయం సాధించలేరు. ఎవరో ఒకరు నేనే విజయానికి కారణమని అనుకుంటే, అది వారి భ్రమ” అని నాగబాబు స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. “రాష్ట్ర భవిష్యత్‌కు పవన్ కల్యాణ్ నాయకత్వమే మార్గం” అని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *