అల్లు అర్జున్ అరెస్ట్‌పై నటుడు నాని స్పందించారు. ఇది మనందరి తప్పు అని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నా. మనం మంచి సమాజంలో జీవించాలి. అదొక దురదృష్టకర, హృదయ విదారక ఘటన. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు’’ అని పేర్కొన్నారు. సినీ దర్శకుడు అజయ్ భూపతి సైతం అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. #WeStandWithAlluArjun అనే హ్యాష్‌ట్యాగ్ జతచేస్తూ తమ సపోర్ట్ తెలియజేస్తున్నారు.






