- 2032, డిసెంబర్ 22న భూమిని ఢీకొట్టే అవకాశముందని నాసా అంచనా
- ప్రభావం తగ్గిందని తాజా పరిశోధనల ప్రకారం వెల్లడించిన నాసా
‘2024 YR4’ అనే ఆస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకువస్తోందని నాసా (NASA) ప్రకటించింది. 2032 డిసెంబర్ 22న భూమిని ఢీకొట్టే అవకాశముందని గత అంచనాల్లో పేర్కొంది. దీని ప్రభావం ఒక పెద్ద నగరాన్ని పూర్తిగా నాశనం చేసేంతటి స్థాయిలో ఉంటుందనే హెచ్చరికలు ఉన్నాయి. అయితే, తాజా పరిశోధనల ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశాలు 3.1 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గాయి. నాసా పరిధిలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (JPL) పరిశోధకులు దీనిపై సుదీర్ఘ పరిశీలనలు నిర్వహిస్తున్నారు. 2032 డిసెంబర్ 22న ఇది భూమికి ఎంత ప్రమాదకారిగా మారనుందో మరింత స్పష్టత వస్తుందనీ, ప్లానెటరీ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్‌కు కీలకమైన డేటా అందుబాటులోకి వస్తుందని నాసా వెల్లడించింది.





