ఓటీటీలో నయనతార ‘ది టెస్ట్‌’ – ఏప్రిల్ 4న స్ట్రీమింగ్!!

  • క్రికెట్ నేపథ్యంలో ఆసక్తికర స్పోర్ట్స్ డ్రామా
  • నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో

స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘ది టెస్ట్‌’ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 4న థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. వైనాట్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. నిర్మాత శశికాంత్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ మూడు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో నయనతార ‘కుముధ’ పాత్రలో కనిపించనున్నారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *