నయా మాల్: స్లీపింగ్ మాస్క్.. బుజ్జి స్మార్ట్ లైట్.. కాలింగ్ బెల్.. మరెన్నో గ్యాడ్జెట్ లు!!

స్లీపింగ్ ఐ మాస్క్ మాత్రమేనా? బ్లూటూత్ హెడ్ సెట్ కూడా!!
రోజంతా ఊరుకులు పరుగులు.. ఒకటే పని. తిరిక దొరికితే చాలు.. కునుకు తీసేద్దాం అనుకుంటారు. కానీ, అదంత వీజీ కాదు. కళ్లేమో స్ట్రెయిన్ అయిపోయి.. మైండేమో బ్లాక్ అయిపోయి.. అటూ, ఇటూ దొర్లడం తప్ప నిద్రపట్టదు. అలాంటప్పుడే ఈ మాస్క్ వాడాలి. ఇదో సాఫ్ట్ స్లీప్ మాస్క్ మాత్రమే కాదు. బ్లూటూత్ హెడ్ బ్యాండ్ కూడా. దీన్ని కళ్లకి తగిలించుకుని, నచ్చిన మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. కనుకు తీసేముందు.. కావాలంటే కాల్స్ కూడా మాట్లాడొచ్చు. అందుకు అనువుగా ఐ మాస్క్ లో హెడ్ ఫోన్స్ ఉన్నాయి.  వాటిని ఒకసారి చార్జ్ చేస్తే.. రెండు గంటల పాటు పని చేస్తాయి. బయటి శబ్దాలు వినిపించకుండా ‘నొయిస్ న్యాన్సిలేషన్’ ఉంది.  మాస్క్ పై భాగంలో ఏర్పాటు చేసిన బటన్స్ తో హెడ్ ఫోన్ ని కంట్రోల్ చేయొచ్చు. ఫోన్, ల్యాపీ, ట్యాబ్లెట్లకు పెయిర్ చేసుకుని వాడుకోవచ్చు. మాస్క్ 22 నుంచి 25 అంగుళాలు ఉంటుంది. దీంతో ముఖానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా తగిలించుకోవచ్చు. 
* ధర: 1499
* దొరుకు చోటు: http://surl.li/jiowxh

ఫోన్ నెంబర్ ని పొదగండి..
ఎలాంటి డిస్ ప్లే ఉండదు. కానీ, మీ ఫోన్ నెంబరు చూడ్డానికి డిజిటల్ గానే కనిపిస్తుంది. క్షణాల్లో కీచైన్ కి ఫోన్ నెంబర్ కి జోడించొచ్చు. ఇంకేముందీ..  కారు, బండి తాళాల్ని కీచైన్ కి పెట్టేయొచ్చు. ఇంకా రోజువారీ ఆఫీస్ అవసరాలకు వాడే  యూఎస్ బీ డ్రైవ్ లాంటివి కూడా కీచైన్ లో పెట్టొచ్చు. సో… ఎప్పుడైనా అనుకోకుండా కీచైన్ పోగొట్టుకుంటే.. దొరికిన వాళ్లు మీకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ గుర్తుతో ఉన్న ట్యాగ్ కీచైన్ లో ప్రధాన ఆకర్షణ.
* ధర: రూ.187
* దొరుకు చోటు: http://surl.li/qdocha

బుజ్జి స్మార్ట్ లైట్.. ఎక్కడైనా వాడేయొచ్చు
ట్రావెలింగ్ నేటి తరానికి ఓ హాబీగా మరిపోయింది. సమయం, సందర్భం లేకుండా జర్నీలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రావెల్ కి అనువైన వాటిని షాపింగ్ చేస్తుంటారు. ఇదిగో ఈ బుజ్జి ఎల్ ఈడీ లైట్ కూడా ట్రావెల్ కి ఎంతో ఉపయోగపడుతుంది.  దారి చూపించే టార్చ్ లైట్ గా వాడొచ్చు. రాత్రిళ్లు అనుకోకుండా కారు లైదా బైక్ ఆగిపోతే రిపేర్ చేసే క్రమంలో  ఈ ఎల్ ఈడీ లైట్ ని తలకి అమర్చుకుని వర్క్ చేయొచ్చు. దీనికి ఉన్న మ్యాగ్నెట్ తో ఎక్కడైనా ఇట్టే అతికించి లైట్ ఆన్ చేయొచ్చు. ఉదాహరణకు కారు రిపేర్ చేసే క్రమంలో లైట్ ని కారు బానెట్ కి అతికించొచ్చు.  లో లైట్ లో షూట్ చేసే క్రమంలో దీన్ని ట్రైపాడ్ కి అమర్చుకుని వాడొచ్చు.  పలు కోణాల్లో టేబుల్ పై పెట్టుకుని కూడా వాడుకునే వీలుంది. ఎక్కడికైనా లైట్ ని తీసుకెళ్లేందు అనువుగా క్లిప్ ఉంది. ఇంకా చెప్పాలంటే.. లైట్ బాటిల్ ఓపెనర్ కూడా వాడుకోవచ్చు. వర్షాకాలంలోనూ వాడుకునేలా ‘రెయిన్ ఫ్రూఫ్’ తో వీటిని తయారు చేశారు.  ఒక్కసారి చార్జ్ చేస్తే నిరంతరాయంగా రెండు గంటలు వెలుగుతాయి.  యూఎస్ బీ కేబుల్ తో లైట్ ని చార్జ్ చేయొచ్చు. 
* ధర: రూ.699
* దొరుకు చోటు: http://surl.li/ftpolc

కాలింగ్ బెల్ ని క్షణాల్లో సెట్ చేయండి
ఇళ్లు విశాలంగా కట్టుకోవడం అందరికీ అలవాటై పోయింది. ఈ క్రమంలో ఇంట్లో గదుల సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరైనా వయసు మళ్లిన పెద్ధవాళ్లుంటే?  వారికేదైనా అవసరం అయితే పిలవాలంటే? ఇదిగో Anchor by Panasonic Wireless Doorbell ని ప్రయత్నించొచ్చు. దీన్ని ఇన్ స్టాల్ చేయడం చాలా సులభం. ఇంట్లో ఎక్కడా ఎలాంటి వైరింగ్ చేయకుండానే దీన్ని వాడొచ్చు. సింపుల్ గా స్వీచ్ బోర్డులోని పవర్ సాకెట్ కి డోర్ బెల్ ని తగిలిస్తే చాలు.  394 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో ఏ మూల నుంచైనా కాలింగ్ బెల్ మోగించొచ్చు.  కాలింగ్ బెల్ నొక్కేందుకు ప్రత్యేక స్వీచ్ ఉంది.  45 రకాల బెల్ ట్యూన్స్ ని కాలింగ్ బెల్ గా సెట్ చేసుకోవచ్చు. హాస్పిటల్స్, ఆఫీసుల్లోనూ దీన్ని సౌకర్యంగా వాడొచ్చు. 
* ధర: రూ.699
* దొరుకు చోటు: http://surl.li/gfjkkv

వీటితో దేన్నయినా చక్కగా జరుపుకోవచ్చు 
ఇంట్లో కొన్ని వస్తువుల్ని అవసరం మేరకు అటు, ఇటు జరుపుకుంటాం. ఈ క్రమంలో కొన్ని వస్తువులు పాడవుతాయ్. కొన్నేమో జరిపేటప్పుడు తెగ చప్పుడు చేస్తుంటాయ్. మరైతే.. అలా పాడవకుండా.. చప్పుడు చేయకుండా.. వస్తువుల్ని జరిపేందుకు ఏం చేయాలి? ఇవిగో ఈ వీల్స్ ని వాడేయండి. JICOOT Appliance Wheels వీల్స్ గా వీటిని పిలుస్తున్నాారు. కాఫీ మేకర్, కూలర్, మిక్సీ, ఫ్రైయర్.. ఇలా అవసరం మేరకు జరుపుతూ వాడే వస్తువులకు వీటిని అతికిస్తే సరి. మూడు మినీ కోస్టర్ వీల్స్ తో వస్తువుల్ని ఎటైనా తిప్పొచ్చు. వీల్స్ అంతే అనువుగా 360 డిగ్రీల కోణంలో ఎటైనా తిరుగుతాయి. హాలులో నిత్యం అటు, ఇటు తిప్పే టీపాయ్, చెక్క పీటలకు కూడా వీటిని అమర్చుకోవచ్చు. వీటి వాడకంతో గదుల్లోని గచ్చు కూడా పాడవకుండా ఉంటుంది. వీటిని వస్తువులకు అతికించిన తర్వాత ఓ రోజంతా వదిలేసి మరుసటి రోజు నుంచి వాడాలి. 
* ధర: రూ.699
* దొరుకు చోటు: http://surl.li/qwgjun

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *