న్యూ ఇయర్ రిజల్యూషన్స్: ఆరంభ శూరులుగా మిగలొద్దు.. నిత్య సాధనకు చిట్కాలు!!

కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందంటే చాలామంది తమ జీవితంలో కొత్త మార్పులు తెచ్చుకోవాలని, చెడు అలవాట్లను వదిలిపెట్టి మంచి మార్గంలో నడవాలని అనుకుంటారు. ఈ ఉత్సాహంతోనే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మొదలుపెడతారు. బరువు తగ్గడం, వ్యాయామం చేయడం, మానసికంగా, శారీరకంగా బలంగా మారడం వంటి లక్ష్యాలు ఎక్కువమందిలో సాధారణం. కానీ, ఈ ఉత్సాహం ఎక్కువగా జనవరి వరకు మాత్రమే ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి బోర్ అనిపించి పాత అలవాట్లకే మళ్లిపోతారు. అయితే, ఈసారి మీ రిజల్యూషన్స్ తప్పకుండా ఫాలో కావాలంటే కొన్ని చిట్కాలను పాటించండి.

స్పష్టమైన లక్ష్యాలు

మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో ఏవి అనివార్యమైనవో ముందుగా నిర్ణయించుకోండి. ఉదాహరణకు, మీరు 5 కిలోల బరువు తగ్గాలని అనుకుంటే, దానికోసం రన్నింగ్‌, యోగా, హెల్తీ డైట్ వంటి టాస్కులను స్పష్టంగా లిస్ట్ చేయండి. ఆ లిస్ట్‌నే మీ టూ డూ ప్లాన్‌గా మార్చి దానికి కట్టుబడి ఉండండి.

అన్నీ ఒకేసారి కాదు.. ఒక్కొక్కటిగా!!

ఒకేసారి అన్ని లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేయవద్దు. ఒక్కటో, రెండో లక్ష్యాలను మాత్రమే మొదట్లో ఫోకస్ చేయండి. ఒక గోల్‌ పూర్తయిన తర్వాత, దానిపై భరోసా కలిగిన తర్వాత కొత్త లక్ష్యానికి మళ్లండి.

సరైన టైమ్ ప్లానింగ్

గోల్ సాధించేందుకు ముందుగానే సమయాన్ని పకడ్బందీగా ప్లాన్ చేయండి. ప్రతి రోజూ మీరు చేపట్టే పని మీ లక్ష్యానికి ఎలా దోహదపడుతుందో అంచనా వేసుకుంటూ ఉండండి.

చిన్నదిగా మొదలుపెట్టండి

ఒక్కసారిగా అధిక సమయం ఖర్చు చేయడం కాదు. ఉదాహరణకు, వ్యాయామం ప్రారంభించాలనుకుంటే మొదట రోజుకు 15 నిమిషాలు మాత్రమే చేయండి. ఆపై మెల్లిగా సమయాన్ని పెంచుతూ పోండి.

పాత తప్పులను గుర్తించండి

గతంలో మీరు రిజల్యూషన్స్ ఫాలో కాకపోవడానికి గల కారణాలను గుర్తించండి. ఈసారి అదే తప్పులను పునరావృతం చేయకుండా ముందే నిరోధక చర్యలు తీసుకోండి.

సంఘటనల నుంచి ప్రేరణ

మీ మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి రిజల్యూషన్స్‌పై చర్చించండి. గ్రూప్‌ సపోర్ట్‌ మీ ఉత్సాహాన్ని కొనసాగించడంలో కీలకంగా మారుతుంది. ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా రిజల్యూషన్స్‌ను ముందుకు తీసుకెళ్తే, ఈసారి వాటిని నిజంగా పూర్తి చేయొచ్చు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *