- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలవడం సంప్రదాయ ప్రక్రియ
- కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం, బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రులు.
దేశ ఆర్థిక విధానానికి అత్యంత కీలకమైన కేంద్ర బడ్జెట్ 2025-26 కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. ముందుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని అనుమతి తీసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిపి, దానికి ఆమోదం తెలపనున్నారు. ఈ సమావేశం అనంతరం 11 గంటలకు నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు.






