సెల్‌ఫోన్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇప్పటివరకు సిమ్ కార్డును రీఛార్జ్ చేయకుంటే నెట్‌వర్క్ కంపెనీలు వాటిని డీ-ఆక్టివేట్ చేసేవి. అయితే ఇకపై కేవలం రూ.20 రీఛార్జ్ ద్వారా సిమ్‌ను యాక్టివ్‌లో ఉంచుకునే వీలుంటుంది. ఈ నిబంధనతో వినియోగదారులు తక్కువ ఖర్చుతో తమ సిమ్ కార్డు సేవలను కొనసాగించుకోవచ్చు. చిన్నపాటి వినియోగదారులకు ఇది పెద్ద సమస్యగా ఉండేది. ఈ మార్పుతో డీ-ఆక్టివేషన్ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించనుంది.





