ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. పాక్ అణు బెదిరింపులు! ఏంటి అసలు కథ?

  • పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో అణు బెదిరింపులు చేశారు.
  • భారత్‌తో యుద్ధం వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు.
  • అసలు పాక్ అణు సామర్థ్యం ఎంత, వాటిని ఎవరు నియంత్రిస్తారు?

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. భారత్‌తో భవిష్యత్తులో యుద్ధం వస్తే, తమ దేశానికి ముప్పు ఉన్నట్లు భావిస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, సింధు నదిపై భారత్ ఏదైనా ఆనకట్ట కడితే దానిని పది క్షిపణులతో పేల్చివేస్తామని కూడా హెచ్చరించారు. అమెరికా గడ్డపై నిలబడి ఒక దేశం ఇలాంటి బెదిరింపులకు దిగడం ఇదే మొదటిసారి.

మునీర్ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ అణు సామర్థ్యం, దాని విధానాలపై చర్చ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద సుమారు 170 అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేసింది. దీనికి భవిష్యత్తులో మరిన్ని రకాల మిసైళ్లతో కూడిన డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. పాకిస్థాన్ అణు ఆయుధాలను నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ) నియంత్రిస్తుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. కానీ, యుద్ధ సమయాల్లో మాత్రం సైన్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పాక్ అణు విధానం అస్పష్టంగా ఉంది. తమ దేశ భద్రతకు ముప్పు వస్తే ముందుగా అణు దాడి చేయం అని పాక్ స్పష్టంగా చెప్పలేదు. అందుకే చాలా దేశాలు పాకిస్తాన్ అణు సామర్థ్యాన్ని ఒక ప్రమాదకర అంశంగా చూస్తున్నాయి. 2011లో అమెరికా పాకిస్తాన్ అణు ఆయుధాలను స్వాధీనం చేసుకునే ప్రణాళికలు రూపొందించిందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అప్పటి పాక్ నాయకుడు పర్వేజ్ ముషారఫ్ ఇలాంటి చర్య పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *