ఇచ్చిన మాట నిలబెట్టుకున్న Pawan Kalyan: విద్యార్థులకు 25 పీసీలు, ఫర్నీచర్ గిఫ్ట్!

Officials handing over computers and books to the headmaster of Sharada ZP High School on behalf of Pawan Kalyan

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన సొంత నిధులతో చిలకలూరిపేటలోని శారద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు 25 కంప్యూటర్లు మరియు ఫర్నిచర్‌ అందజేత!
  • ఈ నెల 5న ఇచ్చిన హామీని కేవలం పది రోజుల్లోనే అమలు
  • విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ అభిమానుల హర్షం!

విద్యార్థులకు ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిలబెట్టుకున్నారు. చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (Sharada ZP High School) విద్యార్థుల కోసం ఆయన తన సొంత నిధులతో 25 కంప్యూటర్లు, అవసరమైన ఇతర ఫర్నిచర్‌ను అందించారు. (Pawan Computers Chilakaluripet School)

ఈ నెల 5న జరిగిన మెగా పేరెంట్స్‌ మీటింగ్‌లో పాఠశాలకు కంప్యూటర్లు, గ్రంథాలయానికి పుస్తకాలు ఇస్తానని పవన్‌ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సరిగ్గా పది రోజుల్లోనే ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నారు. పవన్‌ తరఫున పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్ కృష్ణ తేజ, కలెక్టర్‌ కృతిక శుక్ల, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్లు, పుస్తకాలను అధికారికంగా అందజేశారు.

విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్‌ కళ్యాణ్ విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సంఘటన నిదర్శనమని అధికారులు తెలిపారు. పేరెంట్స్ మీటింగ్‌లో ఇచ్చిన హామీని ఇంత త్వరగా నెరవేర్చడంపై విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, మరియు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కంప్యూటర్ల లభ్యం కావడంతో విద్యార్థులు Digital Education లో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని పాఠశాల సిబ్బంది అభిప్రాయపడ్డారు. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఇలాంటి ప్రోత్సాహకాలు కొనసాగుతాయని కమిషనర్ కృష్ణ తేజ హామీ ఇచ్చారు.

బహు భాషా పుస్తకాలతో లైబ్రరీ

పాఠశాలలో పుస్తకాలు అరకొరగా ఉండడాన్ని గమనించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ రోజు జరిగిన సమావేశంలో లైబ్రరీ నిండుగా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొమ్మిది రోజుల్లో కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయించారు. లైబ్రరీని పుస్తకాలతో నింపేశారు. చిన్నారుల కోసం పెద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, బహుభాషా ప్రావీణ్యాన్ని పెంచే విధంగా స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతోపాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. సుమారు రూ. 25 లక్షలు వెచ్చించి వీటిని ఏర్పాటు చేయించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *