పవన్ కళ్యాణ్ పుట్టినరోజు: శుభాకాంక్షలు వెల్లువ, ప్రముఖుల ప్రశంసలు

పవర్‌స్టార్‌గా సినీ ప్రపంచంలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #HBDPawanKalyan అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి, ‘‘దీర్ఘాయుష్మాన్ భవ..’’ అంటూ ఒక అరుదైన ఫోటోతో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చలనచిత్ర రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు. ప్రజా సేవలో ఆయన అంకితభావం చిరస్మరణీయం అని ప్రశంసించారు.

సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

  • అల్లు అర్జున్: ‘‘మన పవర్‌స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని పోస్ట్ చేశారు.
  • సాయి దుర్గ తేజ్: ‘‘నాకు పట్టుదల నేర్పించి.. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువుకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే కల్యాణ్ మామ’’ అంటూ తన గురువుగా పవన్ కళ్యాణ్‌ను కొనియాడారు.
  • దర్శకుడు జ్యోతి కృష్ణ: ‘‘మీరు లక్షల మందికి స్ఫూర్తి. నిజమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు’’ అని పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు.
  • పరుచూరి గోపాలకృష్ణ: ‘‘తాను ఒక యోగి, ఒక త్యాగి, నూటికి ఒక్కడు కాదు.. కోటికి ఒక్కడు. అతను అక్కడి అమ్మాయికి ఇక్కడి అబ్బాయి కాదు, ఎక్కడున్నా నేను మీకోసం అంటూ ముందడుగు వేసే వకీల్ సాబ్’’ అని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
  • బండ్ల గణేశ్: ‘‘చరిత్రలో ఒకే ఒక్కడు. కోట్ల మంది గుండెల్లో ఆశాజ్యోతిగా మారిన మహోన్నత వ్యక్తి పవన్ కల్యాణ్. మీ పుట్టుకే ఒక అద్భుతం. హ్యాపీ బర్త్‌డే మై బాస్’’ అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *