🔸 జనం భయపడేలా మాట్లాడే వాళ్లను గుర్తించాలి
🔸 చట్టం ముందు ఎవరూ మినహాయింపుకాదు
🔸 పోలీసులకు ఇప్పటికే స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చాం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసాంఘిక ధోరణులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ ఇటీవల సినిమాకు చెందిన డైలాగుల పేరిట చేసిన వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో స్పందించిన పవన్, ‘‘ఇలాంటివి సినిమా హాల్లకే సరిపోతాయి, ప్రజాస్వామ్యంలో కాదు’’ అన్నారు. ‘‘ప్రజల్లో భయాందోళనల్ని రేకెత్తించేలా మాట్లాడే వారిని సహించం. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే వారికి స్పష్టమైన సూచనలు ఇచ్చాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కూటమి ప్రభుత్వం రాజీపడదు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని కంట్రోల్ చేస్తాం. రౌడీషీట్లు తెరవడానికి వెనుకాడం. అలాంటి వర్గాలకు ఎలాంటి ప్రోత్సాహం ఉండకూడదు. వాళ్ల వైఖరిని సమర్థించేవాళ్లూ నేరస్థులే అని ప్రజలు గుర్తించాలి’’ అని పవన్ అన్నారు.





