- తిరుపతి-పళని మధ్య బస్సు సేవలు తిరిగి ప్రారంభిస్తానన్న హామీ
- పవన్ కల్యాణ్ దక్షిణ భారత ఆలయ యాత్ర
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దక్షిణ భారత ఆలయ యాత్రలో భాగంగా మదురై మీనాక్షి అమ్మవారు, సోమసుందరేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్పకళ, విశిష్టతలను ఆలయ పండితులు పవన్‌కు వివరించారు. అనంతరం తిరుప్పరకుండ్రం శ్రీ మురుగన్ స్వామి ఆలయాన్ని సందర్శించి, అక్కడి వేద పాఠశాలకూ వెళ్లారు. తర్వాత పళని మురుగన్ ఆలయానికి వెళ్లిన పవన్ రోప్‌కార్ ద్వారా కొండపైకి చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి-పళని మధ్య బస్సు సేవలు మళ్లీ ప్రారంభించేందుకు చొరవ చూపుతానని చెప్పారు. పవన్ మాట్లాడుతూ, తిరుమల దర్శనం, సేవల టికెట్లు పళనిలోనే బుకింగ్ చేసుకునేలా సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయేందుకు కృషి చేస్తానని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు తిరుపతికి ప్రత్యేక రైలు నడపాలని కోరడంతో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ యాత్రలో పవన్ కల్యాణ్‌తో పాటు కుమారుడు అకీరా నందన్, తితిదే బోర్డు సభ్యుడు ఆనంద సాయి పాల్గొన్నారు.





