ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు: వరల్డ్‌కప్ సాధించిన అంధుల క్రికెట్ జట్టును సన్మానించిన పవన్ కల్యాణ్!

Deputy CM Pawan Kalyan presenting a cheque to a player from the Indian Blind Women's Cricket Team
  • ప్రపంచ కప్ విజేతలైన భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సన్మానించారు
  • జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ. 5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం, కోచ్‌లకు రూ. 2 లక్షలు చొప్పున ప్రోత్సాహకాలు

ప్రపంచ కప్ విజయం సాధించి భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన మహిళా అంధుల క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan with blind cricket team) ప్రత్యేకంగా సన్మానించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సహాయక సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ప్రపంచ స్థాయిలో కీర్తి సాధించిన ఈ క్రీడాకారిణులను పవన్ కల్యాణ్ అభినందించారు. వారి ప్రతిభను దేశ గౌరవంగా పేర్కొన్నారు.

జట్టులో ప్రతి క్రీడాకారిణికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులు, కోచ్‌లకు రూ. 2 లక్షల చొప్పున ప్రోత్సాహకాలను అందజేశారు. అదనంగా ప్రతి ప్లేయర్‌కు పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, అరకు కాఫీ, కొండపల్లి బొమ్మలతో ప్రత్యేక బహుమతులు కూడా అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ దీపిక, కరుణా కుమారి జట్టులో ఉన్నందుకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.

తక్షణ పరిష్కారం

అంధ మహిళా క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఇలాంటి క్రీడల అభ్యాసం కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను తానే స్వయంగా కోరతానని ఆయన తెలిపారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కెప్టెన్ దీపిక తమ గ్రామం శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాకు రహదారి అవసరాన్ని వివరించగా, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కరుణా కుమారి తెలిపిన సమస్యలపైనా తక్షణ చర్యలు ప్రారంభించాలని సూచించారు. జట్టు ప్రతినిధులు వివరించిన మిగిలిన సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడుకు తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.