“వాళ్లు రెచ్చగొట్టినా సంయమనం పాటించండి!!” – ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం

  • వైఎస్సార్సీపీ రెచ్చగొట్టేలా వ్యవహరించినా హుందాతనం పాటించాలని పవన్ సూచన
  • ప్రజా సమస్యలు బడ్జెట్ సమావేశాల్లో బలంగా వినిపించాలని జనసేన శాసనసభాపక్ష సమావేశంలో దిశానిర్దేశం

అమరావతి, ఫిబ్రవరి 25: అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యులు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా, జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హుందాగా వ్యవహరించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో పరిశీలనతో, గౌరవప్రదమైన భాషతో ప్రజా సమస్యలపై గళం వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ –

  • చట్టసభల్లో మాట్లాడే భాష, వ్యవహారశైలి మర్యాదగా ఉండాలి
  • వైఎస్సార్సీపీ సభ్యుల దిగజారుడు వ్యాఖ్యలను పట్టించుకోవద్దు
  • ప్రజా సమస్యలపై బలమైన వాదనలు వినిపించాలి
  • జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాల్లో చురుగ్గా పాల్గొనాలి

సీనియర్ నాయకుల సలహా తీసుకోవాలని సూచన

పరిచయం లేని ఎమ్మెల్యేలు సభ నడిపే పద్ధతిపై సీనియర్లను సంప్రదించాలని, నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, కందుల దుర్గేష్‌ల మార్గదర్శనం తీసుకోవాలని సూచించారు. పవన్ కల్యాణ్ ప్రతీ సభ్యుడు బడ్జెట్‌ను అధ్యయనం చేయాలని, ప్రభుత్వ ఖర్చులు, రాబడులు, కేటాయింపులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమ నియోజకవర్గ సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఎలా ప్రస్తావించాలనే దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. సభ అనంతరం జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *