- టొరంటోలోని పియర్సన్ ఎయిర్‌పోర్టులో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం అదుపు తప్పి బోల్తా పడింది.
- ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కెనడాలోని టొరంటోలో జరిగిన విమాన ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం, అమెరికాలోని మిన్నె పొలిస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పియర్సన్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగిన తర్వాత అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, ఇది ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.





