- డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నిర్మాత కేపీ చౌదరి గోవాలో బలవన్మరణం.
- ‘కబాలి’ సహా పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేసిన చౌదరి.
సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ విక్రయానికి సంబంధించి అరెస్టయిన ఆయన, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. సినీ నిర్మాణంతో పాటు, సర్దార్ గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం వంటి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు.
కుటుంబ సభ్యులకు సమాచారం
కేపీ చౌదరి మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. అతని మృతిచెందిన విషయం పాల్వంచలో ఉన్న ఆయన తల్లికి సమాచారం అందించారు. చౌదరి మరణానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది.





