పంజాబ్‌లోని బఠిండా ఆదేశ్ యూనివర్సిటీ పార్కింగ్‌లో జూన్ 11 సాయంత్రం ఓ కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో లుధియానాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ (కాంచన్ కుమారి) మృతదేహం కనిపించింది. 3.83 లక్షల ఫాలోవర్స్‌తో ‘కమల్ కౌర్ భాభీ’గా ఫేమస్ అయిన కమల్, హత్యకు గురైనట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆమె మృతి 24-48 గంటల ముందు జరిగినట్లు అంచనా. జూన్ 9న బఠిండాలో ప్రమోషనల్ ఈవెంట్ కోసం బయల్దేరినట్లు కమల్ తల్లి చెప్పారు.
కమల్ కౌర్‌ను వేరే చోట హత్య చేసి, ఫేక్ నంబర్ ప్లేట్ కారులో శవం పడేశారు!
కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ ఉండటం, ఫోరెన్సిక్ ఆధారాల ప్రకారం హత్య వేరే చోట జరిగినట్లు పోలీసుల అనుమానం. CCTV ఫుటేజ్‌లో జూన్ 10 తెల్లవారుజామున టర్బన్ ధరించిన వ్యక్తి కారు డ్రైవ్ చేసి, పార్కింగ్‌లో వదిలి నడిచి వెళ్లినట్లు కనిపించింది. “మాకు కొన్ని లీడ్స్ ఉన్నాయి, త్వరలో కేసు ఛేదిస్తాం,” అని SSP అమ్నీత్ కొండల్ తెలిపారు. 2024లో కెనడా బేస్డ్ ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ అర్ష్ దల్లా లింకులతో కమల్‌కు ‘వల్గర్’ కంటెంట్ ఆపమని బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పోలీసులు CCTV, మొబైల్ టవర్ డేటా, ఆమె పర్సనల్ లైఫ్‌లో గొడవలను దర్యాప్తు చేస్తున్నారు.





