అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ చిత్రం వసూళ్లలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 32 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి, అత్యధిక వసూళ్ల సాధించిన భారతీయ చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో, ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు) రికార్డును అధిగమించింది. కాగా, తొలి స్థానంలో ‘దంగల్’ (రూ.2000 కోట్లు) కొనసాగుతోంది.
టాప్ 8 ఇండియన్ మూవీస్ వసూళ్ల జాబితా
- దంగల్ – రూ. 2000+ కోట్లు
- పుష్ప 2 – రూ. 1831 కోట్లు
- బాహుబలి 2 – రూ. 1810 కోట్లు
- ఆర్ఆర్ఆర్ – రూ. 1387+ కోట్లు
- కేజీయఫ్ 2 – రూ. 1250+ కోట్లు
- కల్కి 2898 ఏడీ – రూ. 1153+ కోట్లు
- జవాన్ – రూ. 1148+ కోట్లు
- పఠాన్ – రూ. 1050+ కోట్లు
‘పుష్ప 2’ తెలుగు సినిమాల దిశగా తొలి స్థానాన్ని అందుకోగా, బాలీవుడ్ మార్కెట్లోనూ రికార్డులు సృష్టించింది. 15 రోజుల్లోనే రూ.632 కోట్లు (నెట్) హిందీ మార్కెట్ నుంచి రాబట్టగా, 31 రోజుల్లో ఈ మొత్తం రూ.806 కోట్లకు చేరింది. ‘పుష్ప 2’ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర బృందం ఇప్పటికే 56 రోజులకు ముందుగా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ విడుదల కాదని స్పష్టంచేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.





