- సందడి చేసిన కుటుంబసభ్యులు, స్నేహితులు
- సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేసిన ఫొటోలు
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి ఉపాసన (Upasana) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకున్నారు. “ఈ రోజు ఎప్పటికీ ఆనందకరమైన రోజు.. మీరంతా వచ్చి మరింత ప్రత్యేకత ఇచ్చారు” అంటూ ఉపాసన సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ చేశారు.
సినిమాల పరంగా.. ‘పెద్ది’ గ్లింప్స్
ఇక రామ్‌చరణ్ కెరీర్‌పై ఓ లుక్కేస్తే, ఆయన ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే చిత్రంలో నటిస్తున్నారు. వింటేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయిక. ఉగాది కానుకగా ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.





