- ‘‘ఇక్కడ చూపించిన నా వీడియో చూస్తే ఆశ్చర్యంగా ఉంది’’
- ‘‘శేఖర్ కమ్ముల సినిమా చేయాలన్న కల నెరవేరింది’’
‘కుబేర’ మూవీ ఈవెంట్‌లో రష్మిక తన అనుభవాలను షేర్ చేశారు. ‘‘ఇక్కడ చూపించిన నా సినీ జర్నీ వీడియో చూస్తే ఒక్కసారిగా భయంగా అనిపించింది. ఇన్ని సినిమాలు చేశానా? అనిపించింది. ఒక్కో సినిమాకు ఏడాది పడుతుంది. ఆ టైంలో షూటింగ్ బృందంతో ఫ్యామిలీలా అయిపోతాం. నిజంగా నా ఇంటివాళ్లను కలసి ఏడాది దాటిపోయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నటించాలన్నది నా డ్రీమ్… అది ఈ సినిమాతో ఫుల్ అయింది’’ అన్నారు.
‘‘నాగ్ సర్ గొప్ప నటుడు మాత్రమే కాదు… మంచి మనిషి’’
‘‘నాగార్జున సర్‌తో ఇది నా రెండో సినిమా. ఆయన నటన ఎంత బాగుంటుందో అంతే మంచి వ్యక్తిత్వం కూడా ఉంది. ధనుష్‌గారితో ఈ సినిమా చేయడం మంచి అనుభవం. మా మధ్య వచ్చిన కెమిస్ట్రీ బాగుంది అనిపిస్తోంది. వాళ్లిద్దరితో మళ్లీ మళ్లీ స్క్రీన్ షేర్ చేయాలని ఉంది.” అని రష్మిక చెప్పారు.





