భార్యాభర్తలు అంటారుగానీ.. భర్తభార్యలు అని అనడం ఎప్పుడైనా విన్నారా? నాకెందుకో పెళ్లి అనే ప్రస్తావన రాగానే ఇదే స్ట్రైక్ అయ్యింది!! దేంట్లోనైనా స్త్రీనే ముందు పెట్టిన సమాజం మనది.. కానీ, ఇప్పుడు నాకు దక్కే గౌవరం ఏంటి? నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే!! అంతెందుకు.. రోజూ నేను చూస్తున్నా..
పేపరులో చదువుతున్నా.. మా సందు చివరున్న అంటీ, అంకుల్ డివర్స్ కేస్ దగ్గర్నుంచి సెలబ్రీటీల విడాకుల వైరల్ ముచ్చట్ల వరకూ రీల్స్ అన్నీ రివైండ్ అవుతున్నాయ్. లైక్ కొట్టాలా.. కామెంట్ చెయ్యాలా.. లేదంటే వాటిని బ్లాక్ చేయాలా? నాకైతే కచ్చితంగా విశ్లేషించాలనే అనిపించింది.. ఎందుకంటే.. నాలా పెళ్లి ముచ్చటకి చేరువైన ప్రతి అమ్మాయి కి ఈ క్లారిటీ అవసరం. ఎంతలా అంటే.. ‘పుష్ఫ అంటే పేరు కాదు.. పుష్ఫ అంటే బ్రాండ్’ అని ట్రైలర్ లో బలంగా శ్రీవల్లి చెప్పిందే అలా అన్నమాట.
భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల బంధమే కాదు. వారి కుటుంబాలను కూడా కలిపే ఓ సెలబ్రేషన్. ఈ బంధంతో ఒక్కటైన కపుల్ జీవితమంతా కలిసి గడపాలి. ఒకరికొకరు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఈ బంధం చాలా బరువైన బాధ్యతలతో నిండి ఉంటుంది. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి సుఖ దుఃఖాల్ని పాలు పంచుకోవాల్సి ఉంటుంది. అంతలా లైఫ్ స్టైల్స్ మారిపోతాయి. ఇప్పుడు వారు తమ గురించి మాత్రమే కాకుండా.. ఒకరి గురించి మరొకరు ఆలోచించాలి. ఒకరి సంతోషం మరొకరు చూసుకోవాలి.
ఇలా చెప్పాలంటే ఒపీనియన్స్ చాలా ఉన్నాయ్.. వాటిని కాసేపు పక్కన పెట్టి.. నాణానికి రెండు వైపులా విశ్లేషించాలి. అందుకే పెళ్లి పేరుతో మొదలయ్యే ఈ రిలేషన్ బలంగా వర్క్ అవుట్ అవ్వాలంటే ఏం కావాలి? ఏం నేర్చుకోవాలి? ఏం పాటించాలి? అనే వాటిపై స్పష్టత రావాలి. ఈ ప్రయత్నంలోనే నాకో ఫార్ములా తెలిసింది. అదేంటంటే.. తాను, నేను అనే ఏక వచనం నుంచి మేమూ.. మనమూ అనే బహువచనంగా మారాలి అని. ఓ బ్రాండుగా మారాలి. అదెలా సాధ్యమో తెలియాలంటే ఈ ఐదు.. అంశాల్ని అర్థం చేసుకోవాలంతే!

ఇవ్వడమే కాదు.. పొందడం తెలియాలి!!
‘ప్రేమ ఏ బంధానికైనా పునాది లాంటిది.. ఆశించడం ఎరుగుని ప్రేముంటే ఇంకెంతో పవిత్రం…’ పాత సినిమాల్లో డైలాగ్స్ లా అనిపిస్తున్నాయ్ కదా. అయితే, అవి అప్పటి జనరేషన్ కే సరిపోతాయ్. నేటి తరం తీరు మారింది. ఎందుకంటే.. అప్పటికీ.. ఇప్పటికీ ప్రేమ అలాగే ఉంది. కానీ, దాన్ని పంచడం, పుచ్చుకోవడంలోనే మార్పులు వచ్చాయ్. భార్య ఎప్పుడూ ప్రేమని ఇవ్వడమేకాదు.. దాన్ని తిరిగి భర్త నుంచి పొందడం తెలియాలి. అంటే.. రుచి కరమైన కాఫీ ప్రతి ఉదయం భర్తకి అందింవడమే కాదు.. భర్త కొన్ని ఉదయాలైనా భార్యకి అంతే రుచికరమైన కాఫీ చేసివ్వగలగాలి. ఇలా జరగాలంటే.. భర్య సెన్సిబుల్ గా భర్తకి చెప్పగలగాలి.. ‘నాకు ఇవ్వడంలోనే కాదు.. పొందడంలోనూ.. వండి పెట్టడంలోనే కాదు.. నా కోసం వడడంలోనూ.. సేవలు చేయడంలోనే కాదు.. నా కోెసం చేసిన నాడే తృప్తి’ అని తన మానసుని తాకేలా చెప్పగలగాలి. అదే నేటి తరం పొందాలనుకునే ప్రేమ.
తప్పులైనా కలిసే చేయాలి
దాంపత్య జీవితంలో తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎంతైనా అవసరం!! ఇది కూడా పాత చింతకాయ పచ్చడి లాంటిదే. తింటే బీపీ పెరిగినట్టే… ఫాలో అయితే నేటి తరానికి కచ్చితంగా తలనొప్పి తప్పదు. ఎందుకంటే.. ఒక్కసారి గెట్ మ్యారీడ్.. ఇక ఏ తప్పైనా.. కలిసే చేయాలి. అప్పుడే కలసికట్టుగా సరిదిద్దుకుంటారు. అదే ఒకరికి తెలియకుండా మరొకరు తెలిసో.. తెలియకో… తప్పు చేస్తే.. ఎలా కప్పిపుచ్చుకోవాలా? అని చూస్తారు. ఈ క్రమంలోనే రిలేషన్ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. అందుకే ఒకరిపై మరొకరికి గౌరవం లేకపోయినా ఫర్వాలేదుగానీ.. ఒకరికి తెలియకుండా మరొకరు ఏది చేయొద్దు. భాగస్వామికి విలువ ఇవ్వడం అంటే.. దాపరికం లేకుండా తప్పైనా.. ఒప్పైనా.. చేసేయాలి.
విమర్శని తీసుకోగలగాలి!
ఎక్కడైతే మితిమీరిన గౌరవం ఉంటుందో అక్కడ విమర్శికి స్పేస్ ఉండదు. అదీ భార్యభర్తల మధ్య అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటి తరం ఏదైనా విమర్శని పాజిటివ్ గా తీసుకునేంత ధైర్యం చేస్తున్నారా? అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే… కాంప్లిమెంట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది నేటి డిజిటల్ వరల్డ్. చేసిన కూర బాగోలేదంటే.. తట్టుకోలేని భార్యలు.. ఈ మధ్య మీకు బాగా కోపం ఎక్కువైయ్యింది.. చీటికీ మాటికి చిరాకు పడుతున్నారు.. అన్నందుకు భర్తలు.. విడాకుల వరకూ వెళ్తున్నారంటే ఆశ్ఛర్య పడక్కర్లేదు. ఎందుకంటే.. భయంతో కూడిన వినయం వల్ల వచ్చిన గౌరవం ఉన్నచోట విమర్శని తీసుకునేంత శక్తి ఇరువుకి ఉండదు.
నో చెప్పేంత ధైర్యం ఉండాలి
ఎవరైనా ఒత్తిడికి గురవుతున్నారంటే.. కచ్చితంగా వారిలో మొహమాటం అనే భయంకరమైన వ్యాధి ఉండని అర్థం. ఏదో చుట్టం చూపు వచ్చి వెళ్లిపోయేవారి విషయంలో మోహమాటం పెద్ద సమస్యేం కాదు. నిత్యం మనతో కలిసుండే పాట్నర్ విషయంలో మోహమాటం ఉంటే.. ఆ రిలేషన్ వర్క్ అవుట్ అవ్వదు. వారిలో నచ్చని ఏదైనా ఉంటే నొ చెప్పడంలో వెనకాడొద్దు. మీరు నో చెబుతున్నది భాగస్వామికి కాదు.. ఆ క్షణానికి వారు చేస్తున్నదానికి అని అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇది అర్థమైతే ఏ రిలేషన్ అర్థంతరంగా ముగిసిపోదు. ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్ పదికాలల పాటు చల్లగా సాగిపోతుంది.
తగ్గితే తప్పులేదు..
‘శ్రీ వల్లి నా పెళ్లం… పెళ్లం మాట మొగుడు వింటే ఏట్టా ఉంటదో ఈ ప్రెపంచానికి చూపిస్తా… ’ అని పుష్ఫా సినిమాలో అల్లు అర్జున్ నే తగ్గేదేలే.. అని పెళ్లం కాలితో గడ్డం దువ్వుకున్నాడు. అంటే.. పెళ్ల దగ్గర మొగుడు అంతైనా తగ్గొచ్చు. చెప్పే విషయంలో మంచి ఉంటే.. ఇరువురిలో ఎవరైనా.. ఎక్కడైనా తగ్గాల్సిందే. భార్య కూడా.. కంచంలో భోజనం పెట్టి చేతికి అందించడం.. తల నొప్పి అంటే మాడుకి మసాజ్ చేయడం.. ఏం తగ్గినట్టు కాదు. ప్రేమలో పెళ్లాడిన సామికి సేవలు చేయడమే అని గ్రహించాలి.

ఇరువురి బ్రాండ్ పెరగాలి
భార్యాభర్త ఇరువురూ ఒకనొకరు గౌరవించుకోవడ అంటే.. సంసారంలో వారి బ్రాండ్ ని పెంచుకోవడమే. భాగస్వామి ఎంత ధనవంతుడైనా లేదా పేదవాడైనా భార్య తన స్థాయి తగ్గించ కూడదు. భార్య విషయంలోనూ అంతే. పెళ్లి తర్వాత బాండ్ ని పెంచేది ఇదే. శ్రీవల్లి చెప్పినట్టు.. ‘పుష్ఫ అంటే పేరు కాదు… పుష్ఫ అంటే బ్రాండ్’ అన్నట్టు బలంగా నిలబడాలి.
నిపుణుల మాట
* భార్యాభర్తల మాటలు వ్యక్తిగతం.. కలిసే మాట్లాడుకోండి. ఛాట్ చేసుకోవద్దు.
* అర్థం చేకోవడంలో సహనం చూపండి.. మీ తెలివిని కాదు.
* అనుకోని తప్పులు ఎదురైతే.. ఆత్మీయంగా చేసిన మంచిని గుర్తు తెచ్చుకోండి.
* కలిసి సమయం గడపడం అంటే.. గంటలు లెక్కపెట్టుకోవడం కాదు. గడిచిని కాలాన్ని రివ్యూ చేసుకోవడం.
* ఆనందాల్ని సెలబ్రేట్ చేసుకోవడం అంటే.. అందరి మధ్య చేసుకోవడం కాదు. భాగస్వామి చేయిపట్టుకుని చేయడం అనే విషయం మర్చపోవద్దు.






