దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్బంగా విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలు వీరితో చర్చించారు.
హైదరాబాద్‌లో కొత్త సెంటర్
హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో విప్రో కొత్త సెంటర్ ఏర్పాటుకు రిషద్ ప్రేమ్‌జీ అంగీకారం తెలిపారు. మూడేళ్లలో ఈ సెంటర్ పూర్తి చేసి, 5 వేల మందికి ఉద్యోగాలు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సెంటర్ ద్వారా రాష్ట్రానికి పెద్ద పెట్టుబడి రానుందని, ఐటీ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు.






