టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారా? ఇటీవల సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలు జోరుగా చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ ప్లేయర్స్ లో విడాకులు తీసుకున్న క్రికెటర్ల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇప్పుడు ఈ అంశం క్రిడా ప్రపంచంలో చర్చనీయాంశమవుతున్నాయి. క్రికెటర్ల వ్యక్తిగత జీవితం, వారి కెరీర్‌పై వీటి ప్రభావం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
విడాకులు తీసుకున్న ప్రముఖ భారత క్రికెటర్లు
- శిఖర్ ధావన్ – 2021లో 8 ఏళ్ల వివాహ జీవితం తర్వాత ఆయేషా ముఖర్జీతో విడిపోయారు.
- మొహమ్మద్ అజారుద్దీన్ – మొదట నౌరీన్, తరువాత సంగీత బిజ్లానీతో వివాహం చేసుకున్నారు. 2010లో సంగీతతో కూడా విడాకులు తీసుకున్నారు.
- వినోద్ కాంబ్లీ – 2005లో నియోల్లా లెవిస్‌తో విడిపోయారు.
- రవిశాస్త్రి – 22 ఏళ్ల వివాహ బంధం తర్వాత 2012లో రీతు సింగ్‌తో విడిపోయారు.
- హార్దిక్ పాండ్యా – నటాషా స్టాంకోవిక్‌తో వివాహం తర్వాత, 2024లో విడాకులు తీసుకున్నారు.
- దినేష్ కార్తీక్ – 2012లో నికితా వంజరతో విడాకులు తీసుకున్నారు.
- మనీష్ పాండే – ప్రస్తుతం విడాకుల దిశగా ఉన్నట్లు సమాచారం.
- మనోజ్ ప్రభాకర్ – 2013లో సంధ్యతో విడిపోయారు.
- యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మతో విడాకుల వార్తలు వస్తున్నాయి.
- జావగల్ శ్రీనాథ్ – 2008లో జ్యోత్స్నతో విడిపోయారు.
- మహ్మద్ షమీ – 2020లో హసీన్ జహాన్‌తో విడాకులు తీసుకున్నారు.






