- ప్రముఖ ఫిల్మ్‌మేకర్ శైలేష్ కొలను, ఎన్టీఆర్ క్లాసిక్ చిత్రం **’దాన వీర శూర కర్ణ’**లోని లెజెండరీ డైలాగ్‌ను అదరకొట్టారు.
- ఆయన చెప్పిన డైలాగ్ విని అతిథులందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను తాజాగా అన్నగారు వస్తున్నారు సినిమా ఈవెంట్‌లో **ఎన్టీఆర్ క్లాసిక్ చిత్రం ‘దాన వీర శూర కర్ణ’**లోని పవర్‌ఫుల్ డైలాగ్‌ను రీసైట్ చేశారు. ఆయన చెప్పిన ఆ శక్తివంతమైన సంభాషణ విని, ఈవెంట్‌కు వచ్చిన అతిథులందరూ చప్పట్లు కొట్టారు. డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాన్ స్టాప్ గా సైలేష్ డైలాగ్ చెప్పడాన్ని చూసి కార్తక్ ఆశ్చర్యపడ్డారు. ఇది కేవలం డైలాగ్ చెప్పడం కాదు, ఆ పాత్ర యొక్క ఆత్మను తనలోకి తీసుకుని చెప్పినట్లుగా ఉందని అభిమానులు ప్రశంసించారు.
ఫ్యాన్స్ కామెంట్లు
శైలేష్ కొలానూ చేసిన ఈ ప్రదర్శన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ట్విటర్‌లో షేర్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు, “ఇది కేవలం డైలాగ్ డెలివరీ కాదు.. సోల్ తో చెప్పిన డైలాగ్ అని కామెంట్లు పెడుతున్నారు. శైలేష్ కొలను ఎన్టీఆర్ మీదున్న అభిమానానికి #AnnagaruVostaru అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. శైలేష్ ఈ డైలాగ్‌ను చెప్పిన తీరు ఎన్టీఆర్ అభిమానుల మనసులను తాకింది.





