- హైదరాబాద్ నివాసంలో అరెస్ట్ – ఏపీకి తరలింపు
- దళిత మహిళలపై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ
టీవీ చర్చలో చేసిన వ్యాఖ్యలపై సాక్షి ఛానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అమరావతికి చెందిన మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను హైదరాబాద్‌లోని జర్నలిస్టుల కాలనీలో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. ఈ వ్యవహారంలో ఓ దళిత మహిళ నేత, రాజధాని రైతులు చేసిన ఫిర్యాదుతో SC/ST అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. చర్చలో పాల్గొన్న మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు, అలాగే సాక్షి యాజమాన్యంపై కూడా అదే కేసులో పేపర్స్ ఫైల్ అయ్యాయి. వివరాలు ఇంకా బయటకి రావాల్సి ఉంది కానీ, ఇది మీడియా లోపలి స్వేచ్ఛ – బాధ్యతలపై మరోసారి చర్చకు తావిచ్చింది.





