శాంసంగ్ సంస్థ భారత్‌లో కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. కృత్రిమ మేధ (AI) ఆధారిత ఫీచర్లతో రూపొందించిన ఈ ఫోన్ పేరు గెలాక్సీ ఏ17 5జీ. దీనిని ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసినట్లు శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ తెలిపారు.
ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇందులో 50MP కెమెరా ఉంది. ఈ మొబైల్‌తో 14 ప్రాంతీయ భాషల్లో సంభాషించే అవకాశం ఉంది. సాధారణంగా కిందపడితే పగిలిపోకుండా, గొరిల్లా గ్లాస్ వంటి రక్షణ ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ధర: ఈ ఫోన్ ధర రూ.18,999 నుంచి రూ.23,499 వరకు ఉంటుంది.
క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే, యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపితే కూడా వెంటనే క్యాష్‌బ్యాక్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.





